NTV Telugu Site icon

Viral : ఆదర్శ దంపతులు.. భర్త రేప్ చేస్తుంటే భార్య వీడియో తీసింది

Rape

Rape

Viral : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఆశ వర్కర్‎గా పనిచేస్తుంది. దగ్గర బంధువు అయిన గర్భిణీ ఆమె సాయం కోసం ఇంటికి వచ్చింది. ఆమెను చూసి ఆశ వర్కర్ భర్త గర్భిణిపై కన్నేశాడు. అదును చూసి ఆమెపై అత్యాచారాన్ని పాల్పడ్డాడు. ఆ క్షణంలో తనను ఆపదనుంచి కాపాడాలని ఆశ వర్కర్ ను వేడుకుంది. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ తన భర్తకు సాయంగా వీడియో తీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విషయం వైరల్ అయింది. ఈ ఘటన ఒరిస్సాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. యువతిని భర్త చిత్రహింసలకు గురిచేస్తున్న దృశ్యాలను భార్య చిత్రీకరించి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఘటనను బయటకు చెప్పవద్దని మహిళను కూడా బెదిరించారు. అయితే వేధింపులకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిలో పోలీసుల వీరంగం.. భార్య ఇంట్లో ఉండగా దాడి..

ఒరిస్సాలోని జగన్నాథ్‌పూర్ అనే గ్రామంలో గర్భిణి నివసిస్తుంది. ఆ యువతి తన బంధువు పద్మా రుంజికర్‌ వద్దకు వైద్య పరీక్షల నిమిత్తం సహాయం కోసం వచ్చింది. పద్మ ఆశా వర్కర్. అయితే దీని కోసం పద్మ ఇంటికి వచ్చిన యువతిపై ఆమె భర్త లిలియా అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త నుంచి మహిళను కాపాడే బదులు పద్మ తన ఫోన్‌లో హింసకు సంబంధించిన దృశ్యాలను రికార్డు చేస్తూనే ఉంది. ఆ ఫుటేజీ ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ మహిళను సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి ఆ సమాచారాన్ని బయటకు చెప్పవద్దని ప్రమాణం చేయించారు. అయితే ఆ మహిళ భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు పోలీసులు సైబర్ సెల్‌ను ఆశ్రయించారు. ఈ ఘటనలో పద్మతో పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show comments