NTV Telugu Site icon

Viral News: పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. తెరిచి చూసిన రైతు షాక్!

America

America

America: అమెరికాలోని కెంటుకీలో ఓ వ్యక్తి తన మొక్కజొన్న పొలంలో అంతర్యుద్ధ కాలం నాటి 700 అరుదైన బంగారు డాలర్లను కనుగొన్నాడు. వాటి విలువ మిలియన్ల కొద్దీ ఉంటుందని అంచనా. కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో భూమి దున్నుతుండగా.. ఆటంకం ఏర్పడింది. ఏమై ఉంటుందా అని ఆ ప్రాంతంలో తవ్వి చూడగా.. ఓ పెట్టె బయటపడింది. ఆ పెట్టెను తవ్వగానే అతను షాకయ్యాడు. అందులో బంగారు, వెండి నాణేలు మట్టికొట్టుకుపోయి కనిపించాయి. తను చూసింది నిజమా కాదా అనే ఆలోచనలో అతను చాలాసేపు సందిగ్ధంలో ఉండిపోయాడు. ఆ తరువాత ఆ నాణేలను కొన్ని చేతుల్లోకి తీసుకుని కడిగాడు. అవి దగదగా మెరిసిపోతూ కనిపించాయి. దీంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Also Read: Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు

ఈ నాణేలు అన్నీ 1840-1863 కాలానికి చెందినవిగా తెలిశాయి. అమెరికాలో 1861-1865 వరకు అంతర్యుద్దం జరిగింది. ఈ యుద్దం తరువాత అక్కడి అన్ని బంగారు, వెండి నాణేల మీద ‘ఇన్ గాడ్ వి ట్రస్ట్’ అని రాయబడింది. ఈ వాక్యాలు రైతుకు లభించిన నాణేల మీద కూడా ఉన్నాయని తెలిసింది. దీన్ని బట్టి ఇవి యుద్ద సమయం, యుద్దం ముగిసిన తరువాత ఎవరో భూమిలో నిక్షిప్తం చేశారని అంటున్నారు. రైతుకు భూమిలో దొరికిన బంగారు నాణేలు సుమారు 700 ఉన్నట్లు తెలిసింది. ఇవి భూమిలో ఇన్నేళ్ళ పాటు నిక్షిప్తమైపోయినా వీటి మెరుపు చెక్కుచెదరలేదు. మట్టితో దొరికిన తరువాత వీటిని నీటితో శుభ్రం చేయగానే దగదగా మెరుస్తున్నాయి.

అంతేకాకుండా.. ఈ బంగారు వెండి నాణేలతో పాటు అప్పట్లో వాడుకలో ఉన్న 1డాలర్, 10, 20 డాలర్ల నాణేలు కూడా భూమిలో లభ్యమయ్యాయి, అరుదైన లిబర్టీ ప్యాటర్న్ నాణేలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నిధికి ఆర్కియాలజీ విభాగం వారు ‘గ్రేట్ కెంటకీ హోర్డ్’ అని పేరు పెట్టారు. కాగా ఈ నాణేలను వేలానికి పెట్టారు. ఈ నాణేలలో కొన్నింటి విలువ లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు.

Show comments