Site icon NTV Telugu

Fraud: ఉద్యోగాల పేరుతో మోసం.. భారీగా నగదు ఫ్రీజ్

Jobs Fraud

Jobs Fraud

నిరుద్యోగులే పెట్టుబడిగా దేశ వ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడిన ముఠా ఆగడాలకు పోలీసులు ఆటకట్టించారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాల ముఠాను హైదరాబాద్ పోలీసులు, ఈడీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. పెద్ద ఎత్తున నగదు ఫ్రీజ్ చేయిపించారు.

ఇది కూడా చదవండి: BJP: రాహుల్ గాంధీ కన్నా అడవి ఏనుగులే వయనాడ్‌కి ఎక్కువ సార్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థి కామెంట్స్..

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.524 కోట్లకు పైగా ఈ ముఠా డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. 15 రోజుల వ్యవధిలోనే రూ.524 కోట్ల రూపాయలు వసూలు చేశారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న ఈడీ అధికారులు రంగంలోకి దిగి ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. 500 బ్యాంకుల్లో రూ. 32 కోట్లకు పైగా నగదును ఫ్రీజ్ చేయించారు. Crypto కరెన్సీ ద్వారా నగదును దుబాయ్‌కి బదిలీ చేసుకుంటున్నట్లు గుర్తించారు. వాట్సప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తూ ఈ మోసాలకు తెగబడ్డారు.

ఇది కూడా చదవండి: K Padmarajan: “గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..

దేశవ్యాప్తంగా 50 పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల కేసు నమోదు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. చాకచక్యంగా ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. మోసపోయిన నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. పెద్ద మొత్తంలో నగదును చేజార్చుకున్నారు. పోలీసులు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో ఆరుగురు ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు

Exit mobile version