NTV Telugu Site icon

Fire Accident: ఇంట్లో టపాసులు పేలి అగ్నిప్రమాదం.. దంపతులు మృతి

Fire

Fire

Fire Accident: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్‌ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు. ప్రమాదవశాత్తు వాటికి నిప్పంటుకోవడంతో ఉన్నట్టుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న మోహన్‌లాల్(55), ఉష(50) కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అక్రమంగా పెద్ద ఎత్తున ఇంట్లో టపాసులు నిల్వ చేసినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Tragedy: అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదం.. కొడుకు చనిపోయినా..