Site icon NTV Telugu

Motorola Edge 50 Pro: మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పై రూ.18,650 డిస్కౌంట్.. 50MP సెల్ఫీ కెమెరా, 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో..

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro

మీరు రూ. 25,000 బడ్జెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇది అమెజాన్‌లో రూ.18,650 భారీ తగ్గింపుతో లిస్ట్ అయ్యింది. ఈ హ్యాండ్ సెట్ కలర్-అక్యూరేట్ డిస్ప్లే, అద్భుతమైన పనితీరు, వేగవంతమైన 125W ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోటరోలా హ్యాండ్ సెట్ 12GB + 256GB వేరియంట్‌లో వస్తుంది. దీని అసలు ధర రూ.41,999, కానీ ప్రస్తుతం మీరు దీన్ని అమెజాన్‌లో కేవలం రూ.23,349కి పొందవచ్చు. ఈ ఫోన్ పై 44 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

Also Read:IPL 2026 Auction: అబుదాబిలో ఐపీఎల్ 2026 వేలం.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా?

అంటే ఈ హ్యాండ్ సెట్ పై రూ.18,650 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్స్ పై అదనంగా రూ.1,500 తగ్గింపు, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూజ1,000 వరకు తగ్గింపు ఉంది. ఈ ఆఫర్‌లన్నింటితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత హ్యాండ్‌సెట్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా అదనపు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Also Read:Varanasi : ‘వారణాసి’లోకి పవర్‌ఫుల్ యాక్టర్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లలో 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ HDR10+ కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేస్తుంది.

Exit mobile version