Site icon NTV Telugu

TTD Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!

Ttd

Ttd

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు అని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Also Read: AP Coronavirus Cases: గుంటూరు జిల్లాలో మూడు కొవిడ్‌ కేసులు!

ఓవైపు వేసవి సెలవులు ముగింపుకు రావడం, మరోవైపు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. మరో వారం రోజుల పాటు భక్తుల రద్ధీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు తగిన ఏర్పాట్లను టీటీడీ అరేంజ్ చేస్తోంది. ఇటీవల కాలంలో మెట్ల మార్గం, రోడ్డు మార్గాల్లో పులులు సంచరిస్తుండడంతో.. భక్తులు రక్షణ కోసం టీటీడీ, ఫారెస్ట్, పోలీసుల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version