Huawei Nova 15: హువాయే (Huawei) సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Nova 15ను చైనాలో అధికారికంగా కౌంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో కంపెనీ రూపొందించిన Kirin 8020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 12GB RAMతో పాటు గరిష్టంగా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.9 అపర్చర్, OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్ కలిగిన 12MP టెలిఫోటో లెన్స్, అలాగే మెరుగైన రంగుల ఖచ్చితత్వం కోసం 1.5MP మల్టీ-స్పెక్ట్రల్ ‘Red Maple’ సెన్సార్ ఉన్నాయి.
Silent kil*ler: 2 కోట్ల మందిని చంపింది.. పిల్లలను కూడా వదల్లేదు.. 2026లోనూ ఇదే ప్రమాదం పొంచి ఉందా?
ఇక బ్యాటరీ విషయంలో Huawei Nova 15 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 6000mAh సిలికాన్ ఆధారిత బ్యాటరీ ఉంది. ఇది సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే 100W వైర్డ్ SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడటం విశేషం. ఇందులో 6.7 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంది. ఇది Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, కళ్లకు హాని తగ్గించేందుకు 2160Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఇంకా అల్యూమినోసిలికేట్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు IP65 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFCకు మద్దతు ఇస్తుంది. ఆడియో కోసం Histen 9.0 టెక్నాలజీతో స్టీరియో స్పీకర్లు అందించారు. Huawei Nova 15ను డిసెంబర్ 22, 2025న అధికారికంగా ప్రకటించి, అదే రోజున చైనాలో విక్రయాలు ప్రారంభించారు. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,699 (రూ.34,000 )కి లభిస్తుంది. ఇతర మార్కెట్లలో లాంచ్‌పై Huawei ఇంకా స్పష్టత ఇవ్వలేదు.