భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెండు టాప్ టీమ్స్ పోటీ పడితే చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీంతో త్వరలో ప్రారంభంకాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌ల్లో సన్నాహకాలు చేస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. మరోవైపు 2004 నుంచి భారత్ గడ్డపై టెస్టుల్లో విజయాన్ని అందుకోలేకపోతున్న ఆస్ట్రేలియా.. ఈసారి ఎలాగైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది.
Also Read: Xiaomi Electric Car: షియోమీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు..ఫోటోలు వైరల్
స్వదేశంలో జరిగే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ అన్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ చానెల్స్‌లో ప్రసారం కానుంది. ఈ నెట్ వర్క్‌కు చెందిన స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మళయాళం, తమిళం తదితర చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్థానిక భాషల్లో కామెంట్రీ లభించనుంది. స్టార్ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్‌లు ఆయా భాషల్లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి.
ఉచితంగా చూసేందుకు..
స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడాలంటే జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్ కస్టమర్లు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌తో ఫ్రీగా చూడవచ్చు. జియో సిమ్ ఉన్నవారు జియో టీవీ యాప్ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఈ మ్యాచ్‌ల్ని వీక్షించవచ్చు. జియో టీవీ యాప్‌లోని సెర్చ్‌బార్‌లో స్టార్ స్పోర్ట్స్ చానెల్‌ను సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు. ఎయిర్‌టెల్ కస్టమర్లు అయితే ఎయిర్‌టెల్ టీవీ యాప్ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు. టీవీలో ఫ్రీగా చూడాలనుకుంటే ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. ఈ సిరీస్ మ్యాచ్‌లన్నీ డీడీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానున్నాయి.
Also Read: Sohail Khan: ఉమ్రాన్ లాంటి బౌలర్లు మాకు గల్లీకొకరు ఉన్నారు: పాక్ బౌలర్ కామెంట్స్