Sohail Khan: ఉమ్రాన్ లాంటి బౌలర్లు మాకు గల్లీకొకరు ఉన్నారు: పాక్ బౌలర్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం టీమిండియా భవిష్యత్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. అంతేకాకుండా రెగ్యులర్‌గా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో పలువురు మాజీలు కూడా అతడి బౌలింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే పాక్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. ఉమ్రాన్ లాంటి పేసర్లు పాక్ దేశవాళీలో బోలెడు మంది దొరుకుతారని కామెంట్ చేశాడు.
Also Read: Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
Also Read
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
“ఉమ్రాన్ మాలిక్ మంచి బౌలరే కాదనను. అతడు ఆడిన 1, 2 మ్యాచ్‌లు చూశాను. అతడు బాగా రన్నింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ గంటకు 150 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లను చూడాలంటే నేను 12 నుంచి 15 మంది పేసర్లను చూపిస్తాను. పాకిస్తాన్ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు బోలెడు మంది కనిపిస్తారు. ఒకసారి లాహోర్ ఖలందర్ నిర్వహించే దేశవాళీ మ్యాచ్‌లను వీక్షిస్తే చాలా మంది పేసర్లు కనిపిస్తారు. ఉమ్రాన్ లాంటి బౌలర్లు మా దేశవాళీ క్రికెట్‌లో ఎంతో మంది ఉన్నారు. డొమెస్టిక్ లెవెల్లో రాణించినప్పుడు అతడు తప్పకుండా మంచి బౌలర్ అవుతాడు. షహీన్, నసీమ్ షా, హరీస్ రవూఫ్ లాంటి స్టార్ పేసర్లు ఈ కోవలోకే వస్తారు” అని సోహైల్ ఖాన్ తెలిపాడు.
Also Read: Womens T20 World Cup: విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధం..పూర్తి వివరాలివే
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన అక్తర్(161.3) రికార్డును అతడు అధిగమిస్తాడని అనుకుంటున్నారు. అయితే ఈ అంశంపై స్పందించిన సోహైల్.. అది మనుషుల వల్ల సాధ్యమయ్యే పని కాదని తెలిపాడు. షోయబ్ అందుకోసం ఎంతో శ్రమించాడని అది మరొకరి వల్ల సాధ్యం కాదని అన్నాడు. అతడు రోజులో 32 రౌండ్స్ రన్నింగ్ పూర్తి చేసేవాడని.. తాను వారానికి 20 రౌండ్లు కంప్లీట్ చేయడమే ఎక్కువన్నాడు. అలాంటి నిబద్ధత గల బౌలర్‌ను మరొకరిని చూసే అవకాశం లేదన్నాడు.
తాజావార్తలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!