షియోమీ.. ఈ పేరు వినగానే అందరికీ స్మార్ట్‌ఫోన్స్, టీవీలతో పాటు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు గుర్తుకొస్తాయి. ఈ చైనీస్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండే ఉంది. దీంతో ఇదే అదునుగా ఇప్పుడు ప్రపంచ ఈవీ మార్కెట్‌పై కన్నేసింది షియోమీ. ఈ క్రమంలోనే ఎమ్ఎస్11 సెడాన్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందిస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సమాచారం. త్వరలోనే ఇది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ షియోమీ ఎమ్ఎస్11 సెడాన్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దీంతో యూనిక్ డిజైన్‌తో ఉన్న ఈ కారు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Xiaomi First Electric Car MS11.
Live Images Surface Online.
Will Offer 1000KM in Full Charge.
BYD Seal Like Design.#Xiaomi #Electric pic.twitter.com/dsTRau5llF— Vishal Ahlawat (@vishalahlawat92) February 4, 2023
షియోమీ ఎమ్ఎస్11 సెడాన్ డిజైన్.. ప్రముఖ చైనీస్ ఆటోమొబైల్ సంస్థ బీవైడీకి చెందిన సియెల్ ఎలక్ట్రిక్ సెడాన్‌తో పోలీ ఉంది. బీవైడీ ఈవీని 2023 ఆటోఎక్స్పోలో కూడా ప్రదర్శించారు. ఇక అంతర్జాతీయంగా ప్రముఖ మోడల్స్ నుంచి స్ఫూర్తి తీసుకుని.. ఈ షియోమీ తొలి ఎలక్ట్రిక్ కారును రూపొందించినట్టు కనిపిస్తోంది. ఈ నాలుగు డోర్ల ఎలక్ట్రిక్ సెడాన్‌లో ఫ్లోయింగ్ లైన్స్, ఎయిరోడైనమిక్ సిల్హోయిట్ ఉన్నాయి. ఫ్రంట్‌లో ట్రైడెంట్ ఆకారంలో ఎల్ఈడీ లైట్స్ ఉండటంతో లుక్ ఇంకాస్త అగ్రెసివ్‌గా మారింది. ఇక ఇందులో విండ్‌షీల్డ్ పెద్దగా ఉండటంతో పాటు సైడ్ గ్లాస్ కూడా ఎక్కువగానే ఉంది. పానారోమిక్ సన్‌రూఫ్ రేర్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది. వీల్స్ మధ్యలో షియోమీ బ్రాండ్ లోగో కనిపిస్తోంది. ఇందులోని టెయిల్గేట్స్ డిజైన్.. ఆస్టన్ మార్టిన్ వెహికిల్‌ను పోలి ఉంది.
Also Read: Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?
ఆన్లైన్లో లీక్ అయిన ఈ షియోమీ ఎమ్ఎస్11 సెడాన్‌లో ఇంటీరియర్‌కు సంబంధించి వివరాలేవీ లేవు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా ఎలాంటి వివరాలు లేవు. సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారును షియోమీ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవీకి సంస్థ తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. చైనా రోడ్లపై ఇప్పటికే దీని టెస్టింగ్ జరిగినట్టు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.