తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది పండుగ గురించి అందరికీ తెలుసు.. ఈ పండుగ పేరు చెప్పగానే అందరికీ నోరూరించే ఉగాది పచ్చడి కళ్ళ ముందు కనిపిస్తుంది.. రుచులతో చేసే ఈ పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. అయితే పచ్చడిని చేసుకొని తింటారు.. కానీ పచ్చడిని ఎందుకు చేసుకోవాలో చాలా మందికి తెలియదు.. ఈ పచ్చడిని ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..
చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాది జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9న వచ్చింది.. ఉగాది పచ్చడి ఆరు రుచులను కలియిక.. సుఖ దుఃఖాలను, సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియజెప్పడమే ఈ ఉగాది పచ్చడి ఆంతర్యం. ఇందులో ఉపయోగించే ఆరు పదార్థాలు ఆరు భావోద్వేగాలని సూచిస్తాయి.. జీవితం అంటే అన్ని ఉండాలని సూచికగా ఈ పచ్చడిని చేస్తారు.. అంతేకాదండోయ్ ఈ పచ్చడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చి మామిడి ముక్కలు, చింతపండు రసం, కొద్దిగా బెల్లం, వేప పువ్వు, కారం, ఉప్పు వేసి ఉగాది పచ్చడి తయారుచేస్తారు. ఇందులో వేసే బెల్లం శరీరంలో రక్త కణాలను పెంపొందించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి..
వేప పువ్వు.. పొట్టలోని క్రిములను నాశనం చేసే గుణం ఉంటుంది. అలాగే రక్త శుద్ధికి, డయాబెటిస్ కంట్రోల్‌కు కూడా వేప మంచిది.. యాంటిబయాటిక్ గా పనిచేస్తుంది..
మామిడి కాయ.. వగరు కోసం మామిడికాయను వేస్తారు.. జీర్ణ వ్యవస్థను, చర్మాన్ని, కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది..
కారం.. ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అలాగే మిరపలో ఉండే ‘క్యాప్సైచిన్’ అనే పదార్థం నొప్పులను తగ్గించడంలో సాయపడుతుంది.. అలాగే జలుబు,దగ్గు వంటీ సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది..
చింతపండు.. పులుపు కోసం చింతపండును పులుపు కోసం వాడుతారు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని నివారిస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. చర్మ రక్షణకు కూడా చింతపండు మేలు చేస్తుంది..
ఉప్పు.. శరీరంలోని లవనాలను బ్యాలెన్స్ చెయ్యడంలో సహాయ పడుతుంది.. సమ్మర్ లో వేడి వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది.. అందుకే ఉగాది పచ్చడిని అస్సలు మిస్ కాకండి..