Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాత్రూమ్లో రోజూ వాడే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై నీటిలోని ఉప్పు శాతంతో పాటు సబ్బు నురుగు పేరుకుపోయి తెల్లటి, పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. ఖరీదైన రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో బకెట్‌ను సరికొత్తగా మెరిపించవచ్చు.
బేకింగ్ సోడా అండ్ వెనిగర్: ప్లాస్టిక్‌పై పేరుకుపోయిన మొండి మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి మరకలపై రాయాలి. బాగా గట్టిపడిన చారలు ఉంటే కొద్దిగా తెల్ల వెనిగర్ చిలకరించి, పాత బ్రష్‌తో రుద్ది కడిగితే బకెట్ మెరిసిపోతుంది.
Also Read
- Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
- US: వర్జీనియా వర్శిటీలో కాల్పులు.. పలువురికి గాయాలు
- El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్‌నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
- Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
నిమ్మకాయ – ఉప్పు: నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ పసుపు మరకలను సులభంగా తొలగిస్తుంది. సగం కోసిన నిమ్మచెక్కపై కల్లుప్పు చల్లి బకెట్ లోపల, బయట మెల్లగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే దుర్గంధం పోయి బకెట్ శుభ్రపడుతుంది.
టూత్‌పేస్ట్: చిన్నపాటి మరకలకు తెల్లటి టూత్‌పేస్ట్‌ను రాసి స్క్రబ్బర్‌తో రుద్దడం వల్ల ప్లాస్టిక్ మెరుపు తిరిగి వస్తుంది.
చేయకూడని పొరపాట్లు..
బ్లీచింగ్ పౌడర్ వాడకం: తీవ్రమైన బూజు ఉంటేనే బ్లీచ్ వాడాలి. బ్లీచింగ్ వాడేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ముఖ్యంగా బ్లీచ్‌ను వెనిగర్ లేదా నిమ్మరసంతో కలపకూడదు. ఇది ప్రమాదకరమైన విష వాయువులను విడుదల చేస్తుంది. ఇనుప పీచులు వాడితే ప్లాస్టిక్‌పై గీతలు పడి, భవిష్యత్తులో మురికి మరింత ఎక్కువగా పేరుకుపోతుంది. ఎల్లప్పుడూ మెత్తటి స్పాంజ్ లేదా పాత టూత్‌బ్రష్ మాత్రమే వాడాలి.
మెయింటెనెన్స్ టిప్స్..
స్నానం పూర్తయిన వెంటనే బకెట్లో మిగిలిన సబ్బు నీటిని పారబోసి, మంచి నీటితో కడిగి తలకిందులుగా పెట్టాలి. వారానికి ఒకసారి తేలికపాటి సబ్బుతో కడిగితే బకెట్‌పై మురికి పొరలు పేరుకోకుండా ఎక్కువ కాలం కొత్తదానిలా ఉంటుంది.
తాజావార్తలు
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
-
Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
-
Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
-
AMCA Deal: ఇండియన్ డిఫెన్స్‌లో గేమ్‌చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!