How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How To Clean Tiles Lining: ఇంట్లోని ఫ్లోర్ ఎంత మెరిసిపోతున్నా.. టైల్స్ మధ్యలో ఉండే గ్యాప్స్ (లైన్స్) నల్లగా మారిపోతే మాత్రం ఇల్లు మొత్తం మురికిగా కనిపిస్తుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజూ ఊడ్చి, తుడుచుకున్నా ఆ లైన్లలో పేరుకుపోయే నల్లటి మురికి అంత సులభంగా వదలదు. దీంతో చాలామంది ఖరీదైన క్లీనర్లు కొనుగోలు చేయడం లేదా టైల్స్‌ను గట్టిగా రుద్దడం చేస్తుంటారు. దీనివల్ల శ్రమ ఎక్కువ కావడంతో పాటు టైల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే, దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇంట్లోని వస్తువులతోనే ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
టైల్స్ మధ్యలో ఈ నల్లటి మురికి ఎందుకు చేరుతుంది?
టైల్స్ పైభాగం నునుపుగా ఉండటం వల్ల దుమ్ము, ధూళి సులభంగా తుడిచిపోతాయి. కానీ, టైల్స్ మధ్యలో ఉండే సిమెంట్ భాగం కాలక్రమేణా దుమ్ము, తడిని పీల్చుకుంటుంది. అందుకే ఆ ప్రాంతంలో క్రమంగా మురికి పేరుకుపోతుంది. వంటగదిలో వంట చేసేటప్పుడు నూనె జిడ్డు, ఆవిరి ఆ లైన్లపై పడతాయి. ఇక బాత్రూమ్లో అయితే నీరు నిలవడం వల్ల తేమ ఉండి, మురికితో పాటు ఫంగస్ కూడా తయారవుతుంది. దీనివల్ల తెల్లగా లేదా లేత రంగులో ఉండాల్సిన ఆ లైన్లు నల్లగా మారి ఇల్లు పాతదానిలా కనిపిస్తుంది.
Also Read
- Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
టైల్స్ మధ్య ఉన్న నల్లటి పొరను ఎలా వదిలించాలి?
ముందుగా ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా తీసుకుని, అందులో కొద్దికొద్దిగా నీరు కలుపుతూ చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ టైల్స్ మధ్యలో సులభంగా పట్టేలా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను టైల్స్ మధ్య నల్లగా మారిన ప్రదేశంలో రాయాలి. మురికి వదిలిపోవడానికి దీన్ని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పాత టూత్‌బ్రష్ లేదా మెత్తటి బ్రష్‌తో ఆ లైన్లను మెల్లగా రుద్దాలి. ఎక్కువ బలప్రయోగం చేయడం లేదా ఇనుప స్క్రాపర్లు వాడకూడదు. అలా చేస్తే మధ్యలో ఉండే సిమెంట్ ఊడిపోయే ప్రమాదం ఉంది. బ్రష్‌తో శుభ్రం చేశాక తడి గుడ్డతో ఆ పేస్ట్‌ను, మురికిని తుడిచేయాలి. ఆ తర్వాత మంచి నీళ్లతో శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తుడవాలి. ముఖ్యంగా బాత్రూమ్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఎందుకంటే తేమ ఉంటే మళ్లీ ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. ఇక, బేకింగ్ సోడా, వెనిగర్ కలిపితే నురుగు వస్తుంది కానీ దానివల్ల శుభ్రం కావడం అనేది అంతగా జరగకపోవచ్చు. పైగా వెనిగర్, నిమ్మరసం మార్బుల్స్ లాంటి సహజమైన రాళ్లను, సిమెంట్ బంధాన్ని దెబ్బతీస్తాయి. అలాగే బ్లీచ్‌ను ఎప్పుడూ కూడా వెనిగర్, నిమ్మరసం లేదా ఇతర క్లీనర్లతో కలపకూడదు. అలా చేస్తే ప్రమాదకరమైన వాయువులు వెలువడతాయి. టైల్స్ మధ్య మురికి పేరుకోకుండా ఉండాలంటే వంటగదిలో నూనె పడిన చోటు వెంటనే తుడిచేయాలి. బాత్రూమ్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి మెత్తటి బ్రష్‌తో ఆ లైన్లను శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ నల్లటి మచ్చలు లేదా ఫంగస్ పోకపోతే అప్పుడు మార్కెట్లో దొరికే క్లీనర్లను వాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!