Site icon NTV Telugu

Virat Kohli: ఐపీఎల్‌లో చిన్నగా మొదలైన కోహ్లీ జీతం.. ఇప్పుడు ఎంతో తెలుసా?

Kohli

Kohli

విరాట్ కోహ్లీ నేటితో ఆర్సీబీతో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 2008 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి వారితోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు లీగ్ లోని ప్రతి సీజన్ లో ఒక ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ మొదటగా రూ.12 లక్షలకు ఆర్సీబీలో చేరాడు. ఐపీఎల్ 2008 డ్రాఫ్ట్ లో విరాట్ కోహ్లీ రూ.12 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు.

విరాట్ కోహ్లీ 2008 నుండి 2010 వరకు ప్రతి సంవత్సరం రూ.12 లక్షలు సంపాదించాడు. అతను 2008లో క్యాప్డ్ ప్లేయర్ గా మారాడు. దీంతో అతని స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఐపీఎల్ ప్రారంభంలో కోహ్లీ చాలా కష్టపడ్డాడు. ఐపీఎల్ 2010 తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి జట్టులో కొన్ని మార్పులు చేసింది. కేవలం కోహ్లీని మాత్రమే ఉంచుకుంది. అంతేకాకుండా.. కోహ్లీకి భారీ పారితోషికాన్ని కూడా అందించింది. అతని జీతం అప్పుడు రూ.8.28 కోట్లకు పెరిగింది.

Big Breaking: కేంద్రం సంచలన నిర్ణయం.. సీఏఏ చట్టం అమలుకు నేడే నోటిఫినేషన్‌!

విరాట్ కోహ్లీ 2011 నుండి 2013 వరకు ప్రతి సంవత్సరం రూ.8.28 కోట్లు సంపాదించాడు. 2014లో మెగావేలం జరిగింది. ఐపీఎల్ ఏడవ ఎడిషన్ కు ముందు కోహ్లీ మరో వేతన పెంపును అందుకున్నాడు. ఐపీఎల్ 2014 మెగా వేలానికి ముందు ఆర్సీబీ రిటైన్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. తర్వాత నాలుగు సీజన్లలో రూ.12.5 కోట్ల వేతనం పొందాడు. ఆర్సీబీ ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లను కూడా రిటైన్ చేసుకుంది.

ఐపీఎల్ లో అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆర్సీబీ అతనిని రూ. 17 కోట్లకు రిటైన్ చేయడంతో చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక రిటెన్షన్ ధర కంటే 2 కోట్లు ఎక్కువ. విరాట్ కోహ్లీ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు చార్టులను పాలించాడు. ఐపీఎల్ 2018 నుండి 2021 వరకు ప్రతి సంవత్సరం రూ.17 కోట్లు సంపాదించాడు. ఐపీఎల్ 2021 తర్వాత అతను ఆర్సీబీ కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. కోహ్లీ 2013 నుంచి 2021 వరకు పూర్తిగా కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీని ఆర్సీబీ తన వద్ద ఉంచుకున్న తర్వాత.. అతని జీతం రూ. 17 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ ఆర్సీబీలో అత్యధికంగా చెల్లిస్తుంది కోహ్లీకే.

BRS: రేపు కరీంనగర్లో ‘కథనభేరి’ సభ.. హాజరుకానున్న గులాబీ బాస్

Exit mobile version