Site icon NTV Telugu

Dr. Raja: ఆసుప‌త్రి సేవ‌ల‌లో మ‌హిళ‌ల పాత్ర అద్వితీయం..

Raja

Raja

గ‌త తొమ్మిదేళ్లలో ఎవిస్ ఆసుప‌త్రి ప్రస్థానంలో మ‌హిళా ఉద్యోగుల పాత్ర అద్వితీయ‌మ‌ని ఆసుప‌త్రి మానేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజా.వి.కొప్పాల అన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవ వేడుక‌ల‌లో భాగంగా శనివారం ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ‌న ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోగుల‌కు సేవ‌ల‌కు సంబంధించి ఇన్నేళ్లలో నాలుగు ఫిర్యాదులు మిన‌హా ఎటువంటి స‌మ‌స్యలు లేక‌పోవ‌డం విశేష‌మ‌న్నారు.

Read Also: Purandeswari: పొత్తులపై పార్టీ కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం..

ఆసుప‌త్రి ప‌రిధిలో మ‌హిళ‌ల‌పై అస‌భ్యక‌ర వేధింపుల నిరోధానికి సంబంధించి ఇప్పటికే క‌మిటీ వేశామ‌ని, ఇంత‌వ‌ర‌కు అటువంటి ఫిర్యాదులు లేక‌పోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి కేంద్రంగా ఎవిస్ నూత‌న శాఖ ఏప్రిల్ 1 ప్రారంభం కానుంద‌ని.. ఇదేగాక ముంబై, కోల్‌క‌త త‌ద‌త‌ర మ‌హాన‌గ‌రాల‌లోనూ ఎవిస్ శాఖ‌లు ఏర్పాటు కానున్నాయ‌ని డాక్టర్ రాజా వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆసుప‌త్రి ఉద్యోగులు శిబి కృష్ణన్‌, ప‌ర్వేజ్‌ఖాన్‌, జియా అలీ, మ‌ల్లీశ్వరి, సోమేశ్వరి స్వాతి, అశోక్‌రాజు, రామ్‌కుమార్‌ల‌కు ఉత్తమ ఉద్యోగ అవార్డులుగా ప్రశంసాప‌త్రాలు, న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

Read Also: Rahul Gandhi: కులగణనతోనే పేదలకు మేలు

కార్యక్రమంలో పాల్గొన్న మ‌రో ఆత్మీయ అతిధి శ్రీ‌మ‌తి సురేఖ రాజా కొప్పాల మాట్లాడుతూ.. అంద‌రికీ మ‌హిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆసుప‌త్రిలోని 40 మంది ఉద్యోగినుల‌కు ప్రత్యేక జ్ఞాపిక‌లు, న‌గ‌దు బ‌హుమ‌తిని డాక్టర్ రాజా, శ్రీ‌మ‌తి సురేఖ రాజా అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ఆసుప‌త్రి ప్రధాన అధికారులు సుదీప్త, రాఘ‌వ‌న్, కుమార్‌, ర‌వికిర‌ణ్‌, అచ్యుత‌రావు, హ‌ర్ష, మోళీ వ‌ర్గీస్‌, ర‌వీంద్ర, మ‌హేష్‌, ముర‌ళీ, మల్లీశ్వరి, రాధిక‌, జోమోల్‌, స్పంద‌న, ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version