భారతదేశంలో వివాహ ఆచారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని కలిగి ఉంటాయి. ఈ వివాహ ఏర్పాట్లలో మనం చాలా వైవిధ్యాలను చూడవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల వధూవరులు గుర్రంపై వస్తుంటారు. ఇది వైభవం, సంప్రదాయానికి చిహ్నం కూడా. అయితే.. పెండ్లికుమారుడితో కలిసి గుర్రపు స్వారీ చేస్తున్న ఆనందం బంధువుల వేడుకను మరింత ఉత్సాహంగా మారుస్తుంది. ఈ సందర్భంగా చేసే డ్యాన్స్ ఈ ఆనందానికి రెట్టింపు చేస్తుంది.
అలాగే, ఈ సంతోషకరమైన సమయంలో అనేక ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాంటి దృశ్యాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఓ వ్యక్తి గుర్రంతో డ్యాన్స్ చేస్తున్న దృశ్యమిది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా…?
@manoj_patel_9605 అనే అనే వ్యక్తి.. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్‌లో వరుడు గుర్రంపై కూర్చున్న దృశ్యంతో ప్రారంభమవుతుంది. గుర్రం ముందు నిల్చున్న వ్యక్తి తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తే.. గుర్రం కూడా దానిని అనుసరించింది. పైకి ఈ వ్యక్తి గుర్రపు శిక్షకుడిలా కనిపిస్తున్నాడు. అయితే గుర్రం, ఈ మనిషి మధ్య సాగిన నృత్యంలోని సామరస్యం, ఆనందం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిన్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో నెటిజన్ల ఆసక్తిని ఆకర్షించింది, మిలియన్ వ్యూస్, మిలియన్‌కు పైగా లైక్‌లను పొందింది. దీనిపై నెటిజన్లు కూడా వ్యాఖ్యానించగా, కొందరు ఎమోజీల ద్వారా స్పందించారు.