Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!
- ఖండ్వాలో దారుణం..
- భార్యను చంపించేందుకు భర్తే సుపారీ
- పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో ఒక సినిమా స్టోరీకి మించిన దారుణ ఘటన వెలుగుచూసింది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. మొదట్లో ఇది దోపిడీ హత్యలా కనిపించినా.. చివరికి భర్తే అని తెలిసి అందరి గుండెల దడ పుట్టించింది. మరి ఈ హత్య గల పూర్తి వివరాలను చూస్తే..
పద్మనగర్ థానా పరిధిలోని డిగరిస్ గ్రామంలో మహిళపై రాత్రివేళ దాడి జరిగింది. ఆ దాడిలో భర్తకు స్వల్ప గాయాలు కాగా, భార్యను కత్తులతో 40 సార్లకు పైగా పొడిచి దారుణంగా చంపేశారు. ఈ ఘోరానికి నేరుగా భర్తే సూత్రధారి అని పోలీసు విచారణలో బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితులు టెలివిజన్‌లోని క్రైమ్ పేట్రోల్ వంటి క్రైమ్ షోలు చూసి ఈ హత్యా ప్రణాళికను రూపొందించారు. భర్త మహేంద్ర, తన స్నేహితులు హేమంత్ అలియాస్ కాన్హా, ఆర్యన్, రాజేంద్రలతో కలసి ఈ హత్యను అమలు చేయించాడు. భార్యను చంపించడానికి భర్త ఒక లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడని హేమంత్ విచారణలో ఒప్పుకున్నాడు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
bike riders dangerous stunts: అరేయ్… ఏంట్రా ఇది.. ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా..
మహేంద్ర, హత్యకు రెండు రోజుల ముందు తన ఫోన్ పోయిందని ఇంట్లో చెప్పి కుటుంబాన్ని తప్పుదారి పట్టించాడు. అదే విధంగా ఘటన రోజు రాత్రి సమయంలో.. కడుపు నొప్పి వస్తోందని చెప్పి భార్యను తనతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ మధ్యలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో మిత్రులు దాడి చేసి భార్యను కత్తిపోట్లు పొడిచి చంపేశారు. భర్తకు తేలికపాటి గాయాలు మాత్రమే కలిగించగా, మొత్తం సన్నివేశం దోపిడీలా కనిపించేలా నటించారు.
పోలీసులు విచారణలో వైద్యులను సంప్రదించగా.. మహేంద్రకు ఎలాంటి కడుపు నొప్పి లేదని తేలింది. దీంతో పోలీసులు అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణలో హేమంత్ నేరాన్ని ఒప్పుకోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. నిందితులు హత్యకు కావాల్సిన కత్తులు, గ్లౌజులు ఖండ్వాలోనే కొనుగోలు చేసినట్లు కూడా బయటపడింది. పోలీసుల ప్రకారం, మహేంద్ర తన రెండో భార్య అయిన మృతురాలితో తరచూ విభేదాలు జరిగేవని తేలింది. భార్య తిట్లు తిట్టడం, కుటుంబ సభ్యులతో సరిగ్గా ప్రవర్తించకపోవడం కారణంగా విసిగి, ఈ హత్యా ప్రణాళిక రూపొందించినట్లు హంతకుడు చెప్పినట్లు సమాచారం. సుపారీ ఇచ్చిన ఆధారాలు, అడ్వాన్స్‌గా చెల్లించిన 10 వేల రూపాయలు, హత్యలో ఉపయోగించిన కత్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PAK vs SL: మెరిసిన షాహీన్ అఫ్రిది.. పాకిస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం!
దీనితో ఈ కేసులో ప్రధాన నిందితుడు భర్త మహేంద్రతో పాటు హేమంత్, ఆర్యన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాజేంద్ర ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందానికి ఖండ్వా ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ నగదు బహుమతి ప్రకటించారు.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!