ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు ప్రాణాలకు కూడా ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే పర్యవసానాలను ఆలోచించడంలేదు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మందికి రోజు రోజుకి రీల్స్ పై పిచ్చి పెరిగిపోతుంది. రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్, వ్యూస్, ఫాలొవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాలతో చెలగాటం అడుతారు. తమ ప్రాణాలే కాకుండా తమకు సంబంధం లేని వారి ప్రాణాలను రిస్క్‌లో పెడతారు. యువతి, యువకులు ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నేషనల్ హైవేపై బైక్ రైడర్‌లు ప్రమాదకరంగా స్టంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరు బైక్ రైడర్లు రద్దీగా ఉండే హైవేపై ప్రమాదకర విన్యాసాలు చేశారు. హ్యాండిల్ పట్టుకోకుండా చేతులు వదిలి పెట్టి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. అలాగే కిక్కు సరిపోదన్నట్లుగా మరింత ప్రమాదకరంగా.. ఓ రైడర్ తన ముందు వెళ్తున్న ట్రక్కు వెనుక.. బైక్ హ్యాండిల్ వదిలి పెట్టి పైకి లేచి ప్రమాదకర విన్యాసాలు చేయసాగాడు. బైక్ ముందు టైర్‌తో ట్రక్ వెనుక బాగానికి టచ్ చేస్తూ తెగ ఆనందించాడు.
ఈ స్టంట్స్ తతంగమంతా మరో బైక్ వ్యక్తి తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు వారిపై మండిపడ్డారు. రీల్స్ లైఫ్ అనుకోని లైక్స్ వ్యూస్ కోసం ఇదేం పని అని నెటిజన్‌లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదకర స్టంట్ వల్ల జరగరానిది ఏమైనా జరిగితే.. మీరు చనిపోవడమే కాకుండా ఇతర ప్రాణాలు కూడా రిస్క్‌లో పడుతాయని నెటిజన్‌లు కామెంట్ పెట్టారు. ఇలాంటి రీల్స్ చేసే వ్యక్తులను అరెస్ట్ చేయాలని నెటిజన్‌లు డిమాండ్ చేశారు.
“Reel Life Misadventures” for likes & views…
Median height 1-1.5ft without crash barriers. If tyres jumps divider, HeadON with other cars or 2 wheelers…@DriveSmart_IN @dabir @uneaz @InfraEye @sss3amitg
pic.twitter.com/t0d4B9kLRI— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 23, 2025