Site icon NTV Telugu

Minister Anitha: క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదు.. మరి ఎప్పుడంటే?

Home Minister Anitha

Home Minister Anitha

Home Minister Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక మంత్రి ఎమోషనల్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు 53రోజులు ఇదే రాజమండ్రి జైలులో ఉంచారు. ఎలాంటి తప్పు చేయకుండా చంద్రబాబును జైలులో పెట్టారని నాటి పరిస్థితి గుర్తు చేసుకొని ఆవేదన చెందారు. ఇవాళ పరిస్థితులు తారు మారయ్యాయని.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ఖైదీలు విడుదల ఉంటుందని అన్నారు. కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉన్న కారణంగా కొంత సమయం ఆలస్యం అవుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.

Read Also: Botsa Satyanaryana: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ

జగన్ సెక్యూరిటీని మేము తగ్గించలేదని, పులివెందుల ఎమ్మెల్యేకు నిబంధనల మేరకే భద్రత కొనసాగుతుందని అంటున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. భద్రత కుదించారని జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌కు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలా ? అంటూ ప్రశ్నించారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని జగన్ భయపడుతున్నారా ! అని విమర్శించారు. రాష్ట్రంలో 20 వేల మంది పోలీసులు కొరత ఉండగా జగన్‌కు 900 మంది సెక్యూరిటీ కల్పించడం ఎలా అని ప్రశ్నించారు.

Exit mobile version