NTV Telugu Site icon

Minister Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు.. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

Minister Vangalapudi Anitha

Minister Vangalapudi Anitha

Home Minister Vangalapudi Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విపత్తుల సమయంలో అత్యవసర సహాయక చర్యల్లో పాల్గొనే ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) బృందాల పటిష్టతకు కృషి చేస్తామన్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి ప్రతి సంవత్సరం కనీసం 5 సార్లకు తగ్గకుండా వరదలు, తుపానులు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి అంశాలపై అత్యాధునికి సాంకేతిక శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆమె ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్‌ను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి విపత్తుల వేళల్లో వారి సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకునేందుకు దిశానిర్దేశం చేశారు.

Read Also: Minister Narayana: విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల‌కు స‌హ‌కారం అందించండి..

సహాయక చర్యల సమయంలో వినియోగించే కొత్త సాంకేతిక పరికరాల జాబితా అందిస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేస్తామన్నారు. విడతల వారీగా వాటిని కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చి ప్రమాదాల సమయంలో నష్టనివారణ చర్యలు వేగంగా జరిగేలా సమిష్టిగా కృషి చేద్దామన్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించడమే కాకుండా, సహాయక చర్యలకు పట్టే సమయాన్ని చాలా వరకు తగ్గించడం సాధ్యమవుతుందన్నారు. ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు. అత్యవసర సహాయ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ ఆరు బెటాలియన్లలోని 600 మంది సభ్యులతో కూడిన 12 బృందాలు సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వర్ష ప్రభావమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఏపిఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్, ఎస్డీఆర్ఎఫ్ డీఐజీ రాజకుమారి, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న, ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ డి.మురళీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు దార్శనికతలో డ్రోన్ కేపిటల్‌గా అమరావతి : హోం మంత్రి వంగలపూడి అనిత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో అమరావతి డ్రోన్ కేపిటల్‌గా నిలుస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ పేరిట జరిగిన కార్యక్రమం దేశంలోనే తొలిసారి అని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత సైతం భాగస్వామ్యమయ్యారు.