Minister Vangalapudi Anitha: గుర్ల డయేరియా విషయంలో ఏం జరుగుతుందని పరిశీలించమని అధికారులను ఆదేశించామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సెప్టెంబరు 14 నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంత మంది చనిపోయారనిది ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రాథమికంగా ఒక్కరు చనిపోయారని చెప్పారు. గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం, మంత్రులు పర్యటించారని ఆమె తెలిపారు. నీటి కాలుష్యం వర్షాలు పడినప్పుడు జరుగుతుందన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో పైప్ లైన్స్ వేశారని.. అవన్నీ డ్రైన్‌లో వేసినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియాతో ఆలగడ్డ, కృష్టా ఇలా చాలా ప్రాంతాలలో చనిపోయారని విమర్శించారు. అప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించలేదని ప్రశ్నించారు.
Read Also: CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ హైవేలు!
అధికారం కోల్పేయే సరికి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. ఇప్పుడు వచ్చి చనిపోయిన కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారని అన్నారు. చాలా సార్లు ప్రకటించారు.. కాని ఒక్కరికీ ఇచ్చినట్టు ఎక్కడా కనిపించలేదని విమర్శలు గుప్పించారు. దేనినైన జగన్ మోహన్ రెడ్డి భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తారన్నారు. గుంటూరు ఘటనపై అన్నీ అబద్దాలు చెప్పారని ఆరోపించారు. గ్యాంగ్ రేప్ జరిగిందని చెబుతున్నారు.. ఆడవాళ్లని అడ్డం పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటున్నారని విమర్శించారు.