Kantara Chapter 1: పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కాంతారా ఛాప్టర్ 1’ మళ్లీ వార్తల్లోకి నిలిచింది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఇప్పుడు ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాంతారా ఛాప్టర్ 1’ను ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ చేయాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రేక్షకులు ఈ సినిమాలోని జానపద శైలిని, ఆధ్యాత్మిక భావాన్ని బలంగా అనుభూతి చెందుతారని నిర్మాతలు భావిస్తున్నారు.
Kishkindhapuri OTT: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి చేసిన అద్భుతమైన నటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయన నటనలోని ఆ ఆధ్యాత్మిక ఉత్సాహం, జానపద దేవతా భావాన్ని చూపించిన తీరు ప్రేక్షకులను బ్తగానో మెప్పించింది. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. “కాంతారా” వంటి ఆధ్యాత్మిక చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సిన సమయం వచ్చిందని వారు కూడా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నాయి. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అదేవిధంగా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తన మంత్ర ముగ్ధం చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు ప్రత్యేకమైన భావాన్ని జోడించారు.
