NTV Telugu Site icon

KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్!

Ktr

Ktr

KTR on BRS MLA’s Defections: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెల్చుకున్న బీఆర్‌‌‌‌ఎస్.. కంటోన్మెంట్ బై ఎలక్షన్‌‌లో ఓడిపోయి ఆ సంఖ్య 38కి తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. లోక్‌‌సభ ఎన్నికలకు ముందు కేకే, దానం నాగేందర్‌‌‌‌, కడియం శ్రీహరిలు గులాబీకి బైబై చెప్పి.. హస్తం గూటికి చేశారు. తాజాగా సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 33కు తగ్గింది.

Also Read: NKR21: ‘రాముల‌మ్మ’ ఈజ్ బ్యాక్.. విజయశాంతి ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్‌ రిలీజ్! గూస్‌బంప్స్ పక్కా

పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌‌‌‌ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్‌‌గా ఉన్నారు. అయితే బీఆర్‌‌‌‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందన్నారు. ‘అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు 2004-06 మధ్య కూడా మా పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయయి. ప్రజాఉద్యమం ఉద్ధృతం కావడంతో తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ తలవంచక తప్పలేదు. రానున్న రోజుల్లో చరిత్ర పునరావృతం అవుతుంది’ అని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Show comments