Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి 250ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా కోర్టు 250ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించి కోట్లాది రూపాయలను ముంచిన సాయి ప్రసాద్ కంపెనీ డైరెక్టర్ కు 250 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాదు ఈ కంపెనీ సెహోర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడింది. 250 ఏళ్ల శిక్ష పడిన నిందితుడి పేరు బాలాసాహెబ్ భాప్కర్.
Read Also: Asteroid: భూమికి దగ్గరగా గ్రహశకలం.. పడితే ఓ నగరమే ఖతం
Also Read
- Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్‌లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
భాప్కర్‌తో పాటు కంపెనీ సెహోర్ బ్రాంచ్‌లోని ఉద్యోగులు దీప్‌సింగ్ వర్మ, లఖన్‌లాల్ వర్మ, జితేంద్ర కుమార్, రాజేష్ పర్మార్‌లకు కూడా ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సెహోర్ జిల్లా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ కుమార్ షాహి ఈ శిక్షను ఖరారు చేశారు. నిందితుడు బాలాసాహెబ్ భాప్కర్ సాయిప్రసాద్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా ఐదేళ్లలో డబ్బు రెట్టింపు చేస్తామని వినియోగదారులకు ఎర వేశారు.
Read Also: Lovers : ప్రియుడి వేధింపులు.. ప్రియురాలు ఏం చేసిందంటే..
అతడి మాయలో పడి చాలా మంది ఈ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టారు. అయితే డబ్బులు చెల్లించే సమయానికి ఉద్యోగులు కంపెనీకి తాళం వేసి పరారీ అయ్యారు. కంపెనీకి చెందిన కస్టమర్లు డబ్బులు వసూలు చేసేందుకు కంపెనీ కార్యాలయానికి చేరుకోగా.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. ఈ కేసులో 2016లో సెహోర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఆర్ఐ నమోదైంది. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ డైరెక్టర్‌కి కోర్టు 250 ఏళ్ల శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్‌లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!