Site icon NTV Telugu

Andhra Pradesh: ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్

Yandagandi

Yandagandi

ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు.. మోసపోయే వాళ్లు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. శారీరక ఆనందం కోసం ప్రేమ పేరుతో లొంగదీసుకుంటారు. తీరా అంతా అయిపోయాక నువ్వెవరు అంటారు. ఒకప్పుడు టీనేజ్ వస్తేనే ప్రేమలో పడేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేమకు వయస్సుతో పనిలేకుండా పోయింది. నాలుగు రోజులు ప్రేమించుకున్నామా.. అవసరం తీరిందా.. వదిలేశామా అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎక్కడో చోట మాత్రం నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అది తక్కువ.

D.K Shivakumar: తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ పర్యటన..

ఇదిలా ఉంటే.. ప్రేమ పేరుతో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఓ హిందీ టీచర్ మోసం చేశాడు. అంతేకాదు.. ఆ బాలికను కిడ్నాప్ చేసి, తాళి కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన సోమరాజు అనే వ్యక్తి యండగండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి బాలికపై కన్నేశాడు. విద్యాపాటాలు నేర్పాల్సిన టీచర్‌ ప్రేమ పాటాలతో ఆ అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ఈనెల 19న తన బైక్‌పై ఆ మైనర్‌ బాలికను ఎక్కించుకొని సోమరాజు తన గ్రామానికి తీసుకెళ్లాడు. తాడేరులోనే బాలిక మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Israel: అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్లను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్..

ఈ ఘటనపై దిశ డీఎస్పీ ఎన్. మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్ పురెల్ల సోమరాజును రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. తల్లితండ్రులు విదేశాలలో ఉంటే ఇంటి వద్ద ఉండే తమ కుమార్తెల విషయంలో జాగ్రత్త చాలా అవసరమని డీఎస్పీ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు పాల్పడిన హిందీ టీచర్ ను ఇప్పటికే విధుల నుండి డీఈవో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Exit mobile version