Hindenburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో బాంబు.. ట్విటర్ మాజీ సీఈవోపై సంచలన రిపోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindenburg: అదానీ గ్రూప్‌పై గత జనవరిలో సంచలన ఆరోపణలు చేసిన యూఎస్ షార్ట్ షెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరో సంచలన ప్రకటన చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్స్ తన బాంబును ఈ సారి ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సేపై వేసింది. జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ సంస్థ అక్రమాలను బయట పెట్టింది. తమ రెండేళ్ల పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన వెబ్సైట్లో ప్రచురించిన నోట్లో పేర్కొంది. ముఖ్యంగా తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తన ఫేక్ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న మాయాజాలం అని వ్యాఖ్యానించింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవని, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం.
Also Read
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
Read Also: India Slams Pak: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌పై వ్యాఖ్యానించిన పాక్.. మండిపడిన భారత్
గత జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడైనప్పటి నుంచి అదానీ గ్రూప్ లిస్టెడ్ సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 140 బిలియన్ డాలర్లకు పైగా కొడిగట్టుకుపోయింది. అప్పటి వరకు గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగిన గౌతం అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా హరించుకపోయింది.
తాజావార్తలు
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!