Site icon NTV Telugu

Himaja: క్రిస్మస్‌ వేడుకల్లో సందడి చేసిన బిగ్‌బాస్‌ ఫేం హిమజ

Himaja

Himaja

Himaja: హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల చందన బ్రదర్స్‌ షాపింగ్ మాల్ క్రిస్మస్ వేడుకల్లో బిగ్‌బాస్ ఫేం హిమజ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల జ్ఞాపకాల గురించి పంచుకున్నారు. చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకునే దానినని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ విధంగా వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సారి క్రిస్మస్ వేడుకలు నగరవాసులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నానన్నారు.

18 Pages Trailer: అందంగా, ఆసక్తికరంగా ’18 పేజెస్’ చిత్రం ట్రైలర్

క్రిస్‌మస్‌ వేడుకలు చేసుకోవడమంటే సాధారణంగా కారోల్స్‌ పాడటం, నోరూరించే స్వీట్లను రుచి చూడటం , బహుమతులను వెంట తీసుకువచ్చే శాంటా కోసం వేచి చూడటం కనిపిస్తుంటుంది. మరి ఫ్యాషన్‌ సంగతి..? అది తాము చూసుకుంటామంటోంది చందానగర్‌ చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌. ఈ ఫెస్టివల్‌ సీజన్‌ కోసం తాము ప్రత్యేకంగా కలెక్షన్‌ తీసుకురావడంతో పాటుగా వైభవంగా క్రిస్మస్‌ వేడుకలను కూడా ప్రారంభించామని వెల్లడిస్తున్నారు చందానగర్‌ చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ ప్రతినిధులు. క్రిస్మస్‌ సమీపిస్తున్నవేళ ఎన్నో రకాల వెరైటీలు, సరికొత్త డిజైన్‌లతో ఆహ్వానం పలుకుతోంది. కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే వివిధ రకాల కలెక్షన్‌ తెప్పించామని చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం పేర్కొంది. క్రిస్మస్‌, ఆ వెంటనే వచ్చే న్యూ ఇయర్‌ వేడుకల కోసం కలెక్షన్‌ విడుదల చేశామని వారు వెల్లడిస్తున్నారు.

Exit mobile version