Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Highest Runs In T20 World Cup Top 5 Highest Run Scorers In Icc Mens T20 World Cup History Virat Kohli No 1

Highest runs in T20 World Cup: T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన తోపు ప్లేయర్స్ వీరే.. టాప్-5లో ఇద్దరు మనోళ్లే!

Published Date :February 2, 2026 , 6:49 pm
By Kothuru Ram Kumar
Highest runs in T20 World Cup: T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన తోపు ప్లేయర్స్ వీరే.. టాప్-5లో ఇద్దరు మనోళ్లే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Highest runs in T20 World Cup: ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరో వరం రోజులే ఉంది. ఈ సారి భారతదేశం, శ్రీలంక ఆతిథ్యంగా నిర్వహించే ఈ టోర్నమెంట్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. 2007 నుండి T20 వరల్డ్ కప్ మొదలైందన్న సంగతి తెలిసిందే. కానీ కేవలం కొద్దిమందే ఈ ఫార్మాట్‌ లో సత్తా చూపారు. మరి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ ఎవరో చూద్దామా..

5. డేవిడ్ వార్నర్:
డేవిడ్ వార్నర్ T20 క్రికెట్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ల స్టైల్‌తో బాగా గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌లో వార్నర్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.2021 T20 వరల్డ్ కప్ టైటిల్‌లో అతని పాత్ర కీలకంగా ఉంది. ఆయన ఇప్పటి వరకు 41 ఇన్నింగ్స్ లలో 984 పరుగులు చేశాడు.

4. జోస్ బట్లర్:
జోస్ బట్లర్ ఆధునిక T20 బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా పరిగణించబడతాడు. ఆగ్రెసివ్‌ ప్లేయింగ్ అతని శైలి. ఏ ఇంగ్లాండ్ బ్యాటర్ బట్లర్ 34 ఇన్నింగ్స్ లలో 1013 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా ఆడినా లేదా ఫినిషర్‌గా ఆడినా, నిమిషాలలో మ్యాచ్‌ లను మలుపు తిప్పగలడు. 2022 టీ20 ప్రపంచ కప్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.

3. మాహెల జయవర్ధనే:
శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన మాహెల జయవర్ధనే ఈ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నారు. పవర్ ఫోకస్‌డ్ T20 బ్యాటింగ్‌కు ముందే జయవర్ధనే స్మార్ట్ క్రికెట్ ద్వారా ఫార్మాట్‌లో తన ముద్ర వేసాడు. శ్రీలంక T20 వరల్డ్ కప్ ప్రారంభ కాలంలో కీలక ఆటగాడిగా నిలిచాడు. ఈయన 31 ఇన్నింగ్స్ లలో 1016 పరుగులు చేశాడు. పదేళ్ల తర్వాత కూడా టాప్ 5లో ఉండటం అతని బ్యాటింగ్ పవర్ ఏంటో అర్థమవుతుంది.

2. రోహిత్ శర్మ:
స్టైల్, పవర్‌ కలిస్తే రోహిత్ శర్మ. టీం ఇండియాకు టాప్-ఆర్డర్‌లో ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వడంలో మాజీ కెప్టెన్ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. 2024 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయినా T20 వరల్డ్ కప్ లో రోహిత్ 44 ఇన్నింగ్స్ లలో 1220 పరుగులు సాధించాడు.

1. విరాట్ కోహ్లీ:
ఐసీసీ T20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగుల స్కోరర్ విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీగా అభిమానులు ముద్దుగా పిలుచుకోంమే ఈయన T20 క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు. 2012 నుండి ప్రపంచ కప్ జట్టు వెన్నుగా ఉన్నాడు కోహ్లీ. రన్ చేజ్ చేయడంలో ఛేజింగ్ మాస్టర్ లా, ఆపద సమయంలో ఉత్తమ ఇన్నింగ్స్ లు ఆడటం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ పరుగుల మిషన్ కూడా 2024 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీ కేవలం 33 ఇన్నింగ్స్ లలో 1292 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా ఉన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • David Warner
  • Highest runs in T20 World Cup
  • ICC Men’s T20 World Cup history
  • JOS BUTTLER
  • Mahela Jayawardene

తాజావార్తలు

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

  • Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions