NTV Telugu Site icon

Warangal: నర్సంపేటలో హైటెన్షన్.. ఇరు వర్గాల ఘర్షణ, రాళ్లదాడి

Narsampeta

Narsampeta

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మాట మాట పెరిగి రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Read Also: Betting Apps Scam: బెట్టింగ్ యాప్స్ మోసాల నుంచి ఎలా బయటపడాలంటే?.. ఈ 6 విషయాలు గుర్తుంచుకోండి!

2019లో ఓ మాజీ మిలిటరీ అధికారికి చెందిన భూమిని.. బీఆర్ఎస్ కు చెందిన రామస్వామి నాయక్ అతని స్నేహితులు కలిసి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరం రూ.50 లక్షలు చొప్పున మూడు ఎకరాల భూమికి కోటి 50 లక్షలు భూయజమానులకు చెల్లించారు. అసైన్డ్ భూమి కావడం.. వివాదం కోర్టులో ఉండటంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో మిగతా డబ్బులు చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో భూ వివాదం అలాగే ఉంది. 2019 నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరలా ఆ భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన రామానంద్ అతని స్నేహితులు కలిసి 2024లో భూమిని కొనుగోలు చేశారు. అప్పటినుండి ఈ భూమి మధ్య ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం కోర్టులో నడుస్తుండగా నేడు ఇరు వర్గాలకు చెందిన కొందరు భూమిలో పనులు జరుపుతున్నారని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. కాగా.. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Read Also: World Most Polluted Cities: కాలుష్య కోరల్లో భారతీయులు.. మొదటి 20 నగరాల్లో 13 భారత్ లోనే