Site icon NTV Telugu

High Tension: చంద్రబాబు పర్యటనలో టెన్షన్‌ టెన్షన్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల రాళ్ల దాడులు

Babu

Babu

High Tension: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు.. చంద్రబాబు ముందే వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ నినాదాలు చేయగా.. దీంతో, వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పరం దాడులకు దారితీసింది.. రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.. ఈ దాడుల్లో టీడీపీతో పాటు, వైసీపీ శ్రేణులకు కూడా గాయాలయ్యాయని చెబుతున్నారు.. పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, అంగళ్లు వద్ద కారు దిగిపోయారు చంద్రబాబు.. ఆయన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కేడర్‌ రాళ్లదాడి చేసినట్టు తెలుస్తోంది.. అయితే, వైసీపీ కార్యకర్తలను తరిమికొట్టాలంటూ చంద్రబాబు మైక్‌లో చెప్పారని.. దీంతో, వైసీపీ కేడర్‌ను టీడీపీ శ్రేణులు తరిమినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక, చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటనలోనూ టెన్షన్ వాతావరణం నెలకొన్ని విషయం విదితమే.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ సిద్ధం అయ్యాంది.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.. పుంగనూరులో ప్రాజెక్టులు రానీయకుండా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వబోమంటూ నినాదాలు చేశారు.. కానీ, పుంగనూరులో రోడ్ షో చేసి తీరుతామంటున్నాయి టీడీపీ శ్రేణులు.. 500 మంది పోలీసులతో భారీభధ్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Exit mobile version