Highcourt Telangana : బ‌తుక‌మ్మ కుంటపై హైకోర్టు కీలక తీర్పు..

  • బ‌తుక‌మ్మ కుంటపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు. బ‌తుక‌మ్మ కుంట స్థలం త‌మ‌దంటూ ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టేసిన‌ హైకోర్టు. ఈరోజు హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్. బ‌తుకమ్మ కుంటను కుంట‌గానే గుర్తించిన హైకోర్టు. బ‌తుక‌మ్మ కుంట చెరువు పున‌రుద్ధర‌ణ‌లో హైడ్రా చ‌ర్యలు స‌క్రమ‌మేనంటూ హైకోర్టు తీర్పు.. త్వర‌లో చెరువు పున‌రుద్ధర‌ణ‌కు హైడ్రా చ‌ర్యలు..
Bathukamma Kunta

Bathukamma Kunta

Highcourt Telangana : హైదరాబాద్ అంబర్ పేట్‎లోని బతుకమ్మ కుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వమిదేనని స్పష్టం చేసింది. ఈ స్థలాన్ని తమదని, బతుకమ్మ కుంటపై హైడ్రా చర్యలకు స్టే విధించమని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు 2025 జనవరి 7వ తేదీన తుది తీర్పు ఇచ్చింది.

Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్‌’లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. వీడియో వైరల్

హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ, ఈ కుంట పునరుద్ధరణలో హైడ్రా తీసుకున్న చర్యలు సక్రమమని పేర్కొంది. 1962 లెక్కల ప్రకారం, మొత్తం 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మ కుంట, కబ్జాల అనంతరం ప్రస్తుతం 5 ఎకరాల 15 గుంటల భూమిగా మాత్రమే మిగిలి ఉందని తాజా సర్వేలో తేలింది.

ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలు కోర్టుకు సమర్పించి, అనుకూల తీర్పు రావడంలో హైడ్రా లీగల్ బృందం, రెవెన్యూ ఉద్యోగులు కృషి చేశారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆయా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. హైకోర్టు తీర్పుతో, బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా సిద్ధమవుతోంది.

HYDRA : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు.. ఎక్కడంటే..!