Site icon NTV Telugu

Telangana High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు

Highcourt Ts

Highcourt Ts

Telangana High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు తెలిపింది. కేబినెట్‌కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించొద్దని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని కొట్టివేసింది.

Read Also: Arvind kejriwal : కేజ్రీవాల్ కు షాక్… మార్చి 16న ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే అన్న కోర్టు

అసలు విషయం ఏమిటంటే..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. వీరి పేర్లను గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది. తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని పేర్కొన్నారు. వీరి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏ విషయం తేల్చేవరకూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక ఉండబోదని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి. కానీ ఇంతలో ప్రొ.కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ పేర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాకు ప్రతిపాదించింది. ఈ సిఫార్సుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. తమ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఆమోదించడంపై దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దని హైకోర్టు ఆదేశించింది. తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version