తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో టీటీడీ మాజీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరుమలకు కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, టీటీడీ అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు కల్పించారనే అంశంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
Also Read : CPI Narayana: కాంగ్రెస్, సీపీఐ కలిస్తే.. తెలంగాణలో కేసీఆర్ కు డిపాజిట్ కూడా రాదు
ఇటీవల చిరుత దాడిలో మరణించిన బాలిక లక్షిత కుటుంబానికి మరో రూ 15లక్షలు ఆర్థిక సాయం ఇచ్చే విషయమై పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పులుల నుంచి రక్షణ కల్పించక పోగా టీటీడీ కర్రలు ఇవ్వటం హాస్యాస్పదమని న్యాయవాది బాలాజీ యలమంజుల వాదించారు. మెట్ల మార్గంలో అవసరమైన చోట జంతువులు వెళ్ళటానికి అండర్ పాస్ ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాలని పిటిషనర్ న్యాయవాది బాలాజీ యల మంజుల కోరారు.
Also Read : Uttar Pradesh: హిందూమతంపై కామెంట్స్.. “ఆ నేత నాలుక కోసేస్తే రూ. 10 లక్షల రివార్డ్”..
ఈ ఏడాది మూడు ఘటనలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఇటీవల పులి దాడి చనిపోయిన లక్షిత కుటుంబానికి 15 లక్షలు పరిహారం ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పడంతో. నష్టపరిహారం పెంచటానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
