AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!
- దేవాలయ ఆచారాలపై కీలక పరిణామం
- విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు
- అధికారులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవాలయ ఆచారాలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భగుడిలోకి ప్రవేశించరాదన్న అంశంపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలో పూజలు నిర్వహించకూడదని కోర్టు పేర్కొంది. పూజా కార్యక్రమాల్లో సంప్రదాయ నిబంధనలు కచ్చితంగా పాటించాలంటూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్‌కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. 2010 నవంబర్ 10న దేవాదాయ శాఖ జారీ చేసిన సర్కులర్‌ను అమలు చేయాలని సూచించింది. అలాగే 2024 డిసెంబర్ 20న శృంగేరి పీఠం జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి జారీ చేసిన ప్రామాణికానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది.
Also Read
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ఈ వ్యవహారంపై శ్రీచక్ర నవార్చన పారాయణదారు సుబ్రహ్మణ్య సోమయాజి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది శ్రీనివాస్ వాదనలు వినిపించారు. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు సాంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకుని గర్భగుడిలో పూజలు చేస్తున్నారని, ఇది ఆచార వ్యవహారాలకు భంగం కలిగిస్తోందని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది.. శాఖ సర్కులర్‌తో పాటు శృంగేరి పీఠం ప్రామాణికాలను తప్పకుండా పాటిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. దేవాలయాల్లో పూజా విధానాలు కోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!