NTV Telugu Site icon

AP High Court: నిధుల మళ్లింపు కేసు.. టీటీడీ, తిరుపతి కార్పొరేషన్‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

Ttd

Ttd

AP High Court: టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులకు మళ్లించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టెండర్లు ఫైనల్ చేసినా టీటీడీ నుంచి నిధులను మంజూరు చేయవద్దని టీటీడీ పాలకమండలిని ఆదేశించింది హైకోర్టు.. ధార్మిక సంస్థల నిధులను కార్పొరేషన్ల పరిధిలోని అభివృద్ధి పనులకు మళ్లించిన చరిత్ర ఎక్కడ లేదంటూ హైకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ .. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సెక్షన్ 111 కు చట్ట విరుద్దమంటూ హైకోర్టులో తన వాదనలు వినిపించారు.. అయితే, పిటిషన్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హై కోర్టు.. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా టీటీడీ, తిరుపతి కార్పొరేషన్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హై కోర్టు.

Read Also: Hero Srisimha : శ్రీ సింహ పెళ్లి డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

కాగా, టీటీడీ బడ్జెట్‌లో 1 శాతం తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది.. ఈ నిధులు మళ్లింపును సవాల్ చేస్తూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్ రోడ్లు, పారిశుద్ధ్యానికి కేటాయించడం చట్ట విరుద్ధమని అంటున్నారు.. ఎండోమెంట్ చట్టం 111 ప్రకారం నిధులు మళ్లింపు చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ హైకోర్టులో వాదనలు వినిపించగా.. ఇప్పుడు నిధుల మళ్లింపునకు హైకోర్టు బ్రేక్‌లు వేసినట్టు అయ్యింది.. మరి హైకోర్టులో టీటీడీ, తిరుపతి కార్పొరేషన్‌ ఎలంటి కౌంటర్‌ దాఖలు చేస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.