Site icon NTV Telugu

HIgh Court: కేసీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో బిగ్ షాక్!

Kcr, Harish Rao

Kcr, Harish Rao

High Court refuses to issue interim orders for KCR: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్, హరీష్‌రావు ఎమ్మెల్యేలు కాబట్టి.. అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

Also Read: Aarogyasri Scheme: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

ప్రభుత్వంపై కూడా హైకోర్టు సీరియస్ అయింది. ముందస్తుగా మీడియా సమావేశం నిర్వహించి.. 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అన్ని పబ్లిక్ డొమైన్ నుంచి వెంటనే రిపోర్ట్ తొలగించాలని ఆదేశించింది. కమిషన్ 8B, 8C నోటీసులు ఇవ్వకుండా.. పిటీషనర్లపై ఆరోపణలు చేయడం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని కేసీఆర్, హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

Exit mobile version