Site icon NTV Telugu

High Court: తెలంగాణ మంత్రికి హైకోర్టు షాక్‌.. మధ్యంతర పిటిషన్‌ కొట్టివేత

Koppula Eshwar

Koppula Eshwar

High Court: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్‌ ఇచ్చింది హైకోర్టు.. ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేవారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. అయితే, మూడేళ్ల పాటు విచారణ జరిగి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక.. ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేసింది హైకోర్టు.. ఈ వ్యవహారంలో తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది.. దీంతో.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.

Read Also: Bhagavanth Kesari: పెళ్లి పాటలో డాన్స్ చేస్తున్న బాలయ్య

కాగా, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీచేసిన కొప్పుల ఈశ్వర్.. స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.. అయితే, కొప్పుల ఈశ్వర్ పై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఎన్నికల ఫలితాలపై రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని, కొప్పుల అక్రమ పద్ధతులతో గెలిచారని ఆరోపిస్తూ వచ్చిన లక్ష్మణ్‌.. దీనిపై న్యాయపోరాటానికి దిగారు.. కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక చెల్లదని, తననే ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, ఈ పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది తెలంగాణ హైకోర్టు.

Exit mobile version