న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది.తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.హాయ్ నాన్న సినిమా జనవరి 4వ తేదీన (2024) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. “మీతో ఎప్పుడూ ఉండిపోవడానికి వచ్చేశారు యష్న (మృణాల్ ఠాకూర్), మహీ (కియారా ఖన్నా) మరియు విరాజ్ (నాని). హాయ్ నాన్న మూవీ నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.
థియేటర్లలో రిలీజ్ అయి నెల రోజులు పూర్తి కాక ముందే హాయ్ నాన్న జనవరి 4 నే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాతో పాటు ఓవర్సీస్‍లోనూ మంచి కలెక్షన్లను రాబట్టింది. విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే, సలార్ అదిరిపోయే కలెక్షన్స్ తో దుమ్మురేపుతుండడం అలాగే డెవిల్ మూవీ కూడా రిలీజ్ అవ్వటంతో హాయ్ నాన్న థియేట్రికల్ రన్ దాదాపు చివరికి వచ్చేసింది. దీంతో, అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి హాయ్ నాన్నను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హాయ్ నాన్న సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటించింది.. నాని కూతురు పాత్రను బేబి కియారా ఖన్నా పోషించారు. ఈ చిత్రంలో నాని, మృణాల్, కియారా నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. వీరి పర్ఫార్మెన్స్ మూవీకే హైలైట్‍గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఎమోషనల్‍గా తెరకెక్కించడంలో దర్శకుడు శౌర్యువ్ సక్సెస్ అయ్యాడు..
Hi. Meetho eppudu undipodaaniki vacchesaaru Yashna, Mahi, and Viraj. 🥰
Hi Nanna, streaming from 4th January in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi on Netflix. 👨👩👧#HiNannaOnNetflix pic.twitter.com/pbDnNaf19M— Netflix India South (@Netflix_INSouth) December 30, 2023