హీరోయిన్ కెరీర్ తామరాకుపై నీటి బిందువు లాంటిది. ఎప్పుడు క్లిక్ అవుతుందో.. ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో చెప్పడం కష్టం. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ క్రష్ బ్యూటీలుగా, యూత్ హార్డ్ థ్రోబ్ హీరోయిన్లుగా ఛేంజైన వారున్నారు. ఎన్ని సినిమాలు చేసినా రికగ్నైజ్ కాకుండా వెనుదిగిన వాళ్లున్నారు. కానీ ఇంకొంత మంది కాస్త లేటుగా ఆడియన్స్ దృష్టిలో పడతారు. అలా కొంత డిలే అయినా ఈ ఏడాది రిజిస్టర్ అయ్యారు ముగ్గురు ముద్దుగుమ్మలు యుక్తి తరేజా, రితికా నాయక్, కయాద్ లోహార్.
Also Read : NBK 111 : బాలయ్య సరసన నయనతార ఫిక్స్.. మరో హిట్ లోడింగ్
దీపావళి కానుకగా రిలీజైన కెర్యాంప్లో కిరణ్ అబ్బవరంతో పోటీగా నటించింది హర్యానా గర్ల్ యుక్తి తరేజా. స్టన్నింగ్ లుక్స్‌తో కట్టిపడేసి నయా సెన్సేషనైంది. కానీ ఇది ఆమె ఫస్ట్ ఫిల్మ్ కాదు. రెండేళ్ల క్రితం నాగ శౌర్య హీరోగా నటించిన రంగబలితో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది యుక్తి. సినిమా ప్లాప్ వల్ల పెద్దగా క్రేజ్ రాలేదు. లాస్ట్ ఇయర్ మార్కోతో మాలీవుడ్ ఎంట్రీతో హిట్ కొట్టిన యుక్తి.. ఈ ఏడాది కె ర్యాంప్తో టాలీవుడ్లో ఫస్ట్ బ్లాస్ట్ చూసింది. ఇక వైబ్ ఉంది బేబి వైబ్ ఉందిలే అంటూ టాలీవుడ్ వైబ్ గర్ల్‌గా ఛేంజయ్యింది రితికా నాయక్. మిరాయ్లో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో మెస్మరైజ్ చేసిన బబ్లీ గర్ల్ రితికాకి కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ కాదు. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా కనిపించిన ఈ బ్యూటీ. నాని హాయ్ నాన్నలో స్మాల్ రోల్ చేసింది. సోలో హీరోయిన్గా.. ఫుల్ లెంత్ రోల్లో కనిపించింది మాత్రం మిరాయ్లోనే. ఈ సినిమాతో క్రేజ్ క్రియేట్ చేసుకోవడంలో సక్సీడ్ అయ్యింది. ఇలా ఈ ఇద్దరి భామలు టాలీవుడ్ లో మొదటి సినిమాతో కంటే రెండవ సినిమాతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని హిట్స్ అందుకున్నారు.