T20 WorldCup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో ఆధ్యాంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ ను ఉద్దేశించి తాజాగా ఆస్ట్రేలియా మీడియా మరోసారి టీమిండియా పై విషాన్ని చిమ్మింది. 2024 టి20 ప్రపంచ కప్ లో టీమిండియా విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ.. తన అక్కసును బయటపెట్టింది ఆసీస్ మీడియా. ఒక ఆసీస్ మీడియా తప్పించి మిగతా అంతర్జాతీయ మీడియా సంస్థలు అన్నీ కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ కథనాలు ప్రచురిస్తే.. వారు మాత్రం సౌతఫ్రికా వైఫల్యంతో టీమిండియా విజయం సాధించింది అంటూ రాసుకొచ్చింది.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. కేబినెట్ విస్తరణ పై క్లారిటీ వచ్చే ఛాన్స్..
ఇందులో భాగంగానే సౌతఫ్రికా తడబాటు కారణంగానే టి20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా జట్టు విజయం సాధించింది అంటూ కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ కథనంలో టీమిండియాకి ఈ ప్రపంచకప్ లో అన్నీ కలిసి వచ్చాయి., కేవలం ఫైనల్లో సౌతఫ్రికా విఫలం కావడంతో పాటు.. అంపైర్లు నిర్ణయాలు కూడా భారతదేశం ఎంతో మేలు చేసి చివరికి కప్ గెలిచేలా చేశాయని ఆసీస్ మీడియా రాస్కొచ్చింది. ఇక ఫైనల్ కు చేరిన తర్వాత కూడా టీమిండియా పై ఆసీస్ కాస్త వ్యతిరేకంగానే వార్తలను ప్రచురించింది. ఐసీసీ అండదండలతో టీమిండియా అనుకూలమైన షెడ్యూల్ ను చేసుకుందని విమర్శించింది.
Sasi Madhanam : పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేందుకు రాబోతున్న ‘ శశి మధనం ‘..
ఇది ఇలా ఉండగా.. బ్రిటిష్ మీడియా అలాగే పాకిస్తాన్ మీడియా టీమిండియా అద్భుత విజయాన్ని కొనియాడుతూ వార్తలను ప్రచురించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందిన డాన్ పత్రికలో టీమిండియా విజయోత్సవాలకు సంబంధించిన ఫోటోను ఫ్రంట్ పేజీలో వేసి భారత్ అసాధారణ విజయం సాధించింది అంటూ తెలిపింది. ఈ మ్యాచ్ విజయంలో విరాట్ కోహ్లీ గేర్ మార్చి టీమిండియాకు కప్పు అందించడం ఒక కథనంలో తెలిపింది. అలాగే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ ఫైనల్లో సౌతఫ్రికా మరోసారి తన చేతులెత్తేసే పరంపరని కొనసాగించిందంటూ తెలిపింది. ఇక బ్రిటిష్ మీడియా మాత్రం టీమిండియా జట్టు సమిష్టిగా రాణించి అద్భుత విజయంతో టైటిల్ ని సొంతం చేసుకున్నాడంటూ కొనియాడింది.