Site icon NTV Telugu

Mehreen Pirzada : బక్క చిక్కిన హీరోయిన్.. గుండెలు బాదుకుంటున్న కుర్రకారు

Mehrin

Mehrin

ఇండస్ట్రీలో టాలెంట్‌ ఎంత ఉన్నా అందం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే హీరో, హీరోయిన్లు ఫిట్‌నెస్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్‌ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా ఉండి మెస్మరైజ్‌ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే బెటర్‌ అని అంటున్నారు.

Also Read : NCP: రేపు ఎన్సీపీ కీలక సమావేశం.. శరద్ పవార్ వారసుడి ఎంపిక..! వీరిద్దరికే ఛాన్స్..

అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి హీరోయిన్ మెహ్రీన్‌ కూడా చేరింది. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్‌ ఈ మధ్యకాలంలో మరీ సన్నబడింది. మెహ్రీన్ వస్తూ వస్తూనే సంచనాలు చేసింది. ముద్దుగా బొద్దుగా ఉన్న ఆమె ఫిగర్ తో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. అలాంటి మెహ్రీన్ పూర్తిగా మారిపోయారు. ఆమె బాగా బరువు తగ్గారు. తాజాగా డెనిమ్ జీన్స్ లో నడుము చూపిస్తూ కుర్ర గుండెలు కొల్లగొట్టింది.

Also Read : Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది..!

ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. మెహ్రీన్ నటించిన లాస్ట్ మూవీ ఎఫ్ 3 అది అంతలా ఆకట్టుకోలేదు. ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఒకింత నిరాశపరిచింది. ఓపెంగ్స్ వచ్చినప్పటికీ జోరు కొనసాగించలేకపోయింది. వెంకీ- వరుణ్ ల ఈ మల్టీస్టారర్ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. దీంతో ఎఫ్ 3 తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు.

Also Read : Virat vs Gambhir : ఇప్పట్లో ఈ పంచాయితీ ఒడిసేటట్లు లేదుగా..

ప్రస్తుతం మెహ్రీన్ స్పార్క్ పేరుతో ఓ తెలుగు సినిమా చేస్తుంది. ఈ మూవీలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. రిసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. వీటితో పాటు ఓ కన్నడ సినిమా కూడా చేస్తుంది. కన్నడలో మెహ్రీన్ కు తొలి సినిమా కావడం విశేషం. అయితే మెహ్రీన్ 2021లో భవ్య బిష్ణోతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు.

Also Read : Keerthy Suresh: కీర్తి అలా నవ్వితే ఎలా.. గుండెలను కొల్లగొడుతున్నావుగా

అయితే తాజాగా వర్కవుట్స్‌, డైట్‌ పాటిస్తూ జీరో సైజ్‌కి మెహ్రీన్ వచ్చేసింది. లేటెస్ట్‌గా తన లుక్‌కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్ లో షేర్‌ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్‌కు ఏమైంది ఇంత సన్నబడింది? అంటూ కుర్రకారు గుండెలు బాదుకుంటున్నారు. ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంటుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Exit mobile version