Vijayakanth : తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ చెకప్ కోసమే అని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సమాచారం. విజయ్ కాంత్ హీరోగా పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి పాపులారిటీ దక్కించుకున్నారు. అంతేకాదు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోను తన సత్తా చాటాడు. తమిళనాడు అసెంబ్లీలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను నిర్వహించాడు. రాజకీయాలలోకి చేరక ముందు అతను సినిమాల్లో నటిస్తూనే, నిర్మాత, దర్శకుడిగా పనిచేశారు.
Read Also:Robert Vadra : మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో తొలిసారిగా రాబర్ట్ వాద్రా పేరు
విజయ్ కాంత్ తమిళనాడులో ప్రస్తుతం దేశీయ ముర్పొక్కు ద్రవిడ కఝగం పార్టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. విజయ్ కాంత్ విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం రాజకీయ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీకి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అతనే. ఇక విజయ్ కాంత్ పూర్తి పేరు.. విజయరాజ్ అలగర్‌స్వామి 1952 ఆగస్టు 25లో జన్మించారు. ఇక విజయ్ కాంత్ కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు తెలుగులో ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తమిళ్‌లో వందలాది సినిమాల్లో హీరోగా నటించారు. నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారారు. విజయ్ కాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 70 ఏళ్ల విజయ్ కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Read Also:IND vs SA: సెంచూరియన్ టెస్టులో పోరాడుతున్న కేఎల్ రాహుల్.. భారత్ స్కోర్ 208/8!