Vijay Sethupathi Talk About Vote: మత రాజకీయాలు చేసే వారికి అస్సలు ఓటు వెయ్యొద్దని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు ఆలోచించిన తర్వాతే ఓటు వేయాలని కోరారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగన్నాయి. పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల వేళ విజయ్ సేతుపతి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి వైరల్ అయిన ఈ వీడియో పాతది.
కొన్నేళ్ల క్రితం విజయ్ సేతుపతి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తమిళ భాషలో మాట్లాడుతూ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ‘నా దేశ ప్రజలారా.. ఓటు వేయడం చాలా ముఖ్యం. బాగా ఆలోచించిన తర్వాతే ఓటు వేయండి. మన రాష్ట్రం, ఊరు, కాలేజీ, స్కూల్, స్నేహితులకు సమస్య ఉందని చెప్పి.. మంచి చేసేవారికి ఓటు వేయండి. కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడిగితే అస్సలు వెయ్యొద్దు. కులం, మతం సమస్య అని చెప్పేవారు వాళ్ల ఇళ్లల్లో భద్రంగా ఉంటారు. మనం సమస్యల్లో ఇరుక్కుపోతాం. కాబట్టి అర్థం చేసుకుని ఓటేయండి’ అని విజయ్ సేతుపతి అన్నారు.
Also Read: Explosives in Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాల కలకలం.. ఆందోళనలో స్థానికులు!
విజయ్ సేతుపతి ఇటీవల ‘మెర్రీ క్రిస్మస్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ ఆయన బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2021లో ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.
Don’t vote for the ones who say our religion is in Danger!
-Actor Vijay Sethupathi pic.twitter.com/4Ayx3MHUJ4
— We Dravidians (@WeDravidians) March 18, 2024