Tamil Nadu: హీరో విజయ్ పార్టీ కీలక భేటీ.. నిర్ణయాలివే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో విజయ్ (Hero Vijay) సోమవారం తొలి పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సుదీర్ఘకాలం మనుగడ కొనసాగేలా.. పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు సభ్యత్వం తీసుకుంటారని.. వారిని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు.
అలాగే మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజయ్ తెలిపారు. దీంతో పాటు జిల్లాల వ్యాప్తంగా పార్టీ క్యాడర్‌పై దృష్టి సారించాలని ముఖ్య నేతలకు సూచించారు. జిల్లాల వారిగా నమోదైన కొత్త ఓటర్ల జాబితాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీలో ఏ విషయంలోనైనా అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ అనేలా ముందుకు సాగాలన్నారు. 2026 ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు వెళ్లాలని శ్రేణులకు విజయ్ దిశానిర్ధేశం చేశారు.
Also Read
2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జిల్లాల వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదుకు క్యాంపులు ఏర్పాటు చేయాలని పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశించారు. అందుకోసం పార్టీలో కొందరు మహిళలకు నియామకాలు చేపట్టాలని తెలిపారు. వీరితో ప్రత్యేకంగా మహిళా విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని అందుకు తగిన కార్యాచరణను మార్గదిర్ధేశం చేశారు.
విజయ్ ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. గత కొంత కాలంగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నప్పటకీ వాటిని త్వరితగతిన పూర్తిచేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలోనే పార్టీ ముఖ్య సభ్యులతో కీలక సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోవడం తమిళనాడులో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!