NTV Telugu Site icon

Bedurulanka 2012 : నేను అలా అనలేదు.. త‌ప్పుడు ప్ర‌చారాలు చెయ్యొద్దు: కార్తికేయ స్ట్రాంగ్ వార్నింగ్

Bedurulanka

Bedurulanka

ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇబ్బందిగా మారిన సమస్య ఫేక్ న్యూస్ ప్రచారం. ముఖ్యంగా సెలబ్రెటీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం చాలా మంది తమకు నచ్చిన టైటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగునపడిపోయి లేని వివాదంలో ఎంతో మంది చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలానే తనకు సంబంధించి ఒక ఫేక్ వార్త రావడంపై హీరో కార్తికేయ ఘాటుగా స్పందించారు.

హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012 . ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. దీనికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తూ ఉండగా… డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి కార్తికేయకు జంటగా నటిస్తోంది. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా హీరో కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంట‌ర్వ్యూలో మూవీ ప్రమోషన్స్‌పై మాట్లాడగా.. ఓ సినిమా వెబ్‌సైట్ ఆ ఇంట‌ర్వ్యూలో కార్తికేయ చెప్పని మాటలను తప్పుడు థంబ్‌నెల్స్‌తో సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

Also Read: Nani Controversy: పాన్ ఇండియా స్టార్ వ్యాఖ్యలు.. నానిపై మండిడుతున్న బడా హీరోల ఫ్యాన్స్

దీనిపై కార్తికేయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు. ‘ఇంటర్వ్యూని చక్కగా చూసిన తరువాత మాత్రమే మీరు వార్తలు పోస్ట్ చేయండి. మీరు థంబ్ నెయిల్ లో పెట్టిన మాటలు నేను అనలేదు. సినిమాకి, నటులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి వాటిని పోస్ట్ చేయకండి’ అని x(ట్విటర్) వేదికగా స్పందించారు.

ఇంతకి ఆ వెబ్‌సైట్ ఏం పోస్ట్ చేసింది అంటే ఆర్ ఎక్స్ 100 తో నాకు రోమాంటిక్ ఇమేజ్ వచ్చింది. అదేవిధంగా డీజే టిల్లుతో నేహాకి కూడా రోమాంటిక్ ఇమేజ్ వచ్చింది. సో మా మీద ఎక్స్ పెటేషన్స్ ఉంటాయి. సో బెదురులంకలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల నటులపై ఒకరకమైన ముద్రపడిపోతుందని ఇలాంటివి రాయొద్దని సోషల్ మీడియా వేదికగా చెప్పారు కార్తికేయ

 

 

Show comments