Ajith Car Accident: కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) రేసింగ్ ప్రియుడని తెలిసిందే. ఆయనకి బైక్, కార్ రేసింగ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో.. తాజాగా ఆయన దుబాయ్ వేదికగా జరిగబోయే ‘Dubai 24 Hours Race’లో పాల్గొనడం కోసం వెళ్లారు. దుబాయ్ చేరుకున్న ఆయన అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా గాయాల్లేకుండా భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అజిత్ రేసింగ్ ట్రైనింగ్ సమయంలో, ఆయన కారులో భారీ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్‌కు గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో వెల్లడించింది. అజిత్ ప్రాక్టీస్ సెషన్‌లో కారు ప్రమాదానికి గురయ్యారు, కానీ ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. రేసింగ్ అంటే ఇలాంటి ప్రమాదాలు సాధారణం అని రేసింగ్ టీం పేర్కొంది.
Also Read: Online Betting App: వెయ్యి పెట్టుబడితో రూ.లక్ష సంపాదన.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
The video is out officially. #Ajith sir is safe and healthy 🙏🏻♥️ Not here for engagements or impressions 🙏🏻 https://t.co/odP3GbRRHD
— Ashok Surya (@AshokSuryaOff03) January 7, 2025
అజిత్ కుమార్ అభిమానులు రేసింగ్ ప్రాక్టీస్ వీడియోను చూసి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. ఆయన సన్నిహిత వర్గాలు త్వరగా స్పందించాయి. అజిత్ సురక్షితంగా ఉన్నారు. ఎటువంటి ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులకు స్పష్టమైన సమాచారం అందించారు. ఇకపోతే, ‘Dubai 24 Hours Race’లో అజిత్ కుమార్ తన సొంతంగా ఒక రేసింగ్ టీం ఏర్పాటుచేశారు. ఈ టీమ్‌కి అజిత్ యజమాని. ఒకవైపు యజమానిగా, మరొక వైపు రేసర్‌గా ఈ అంతర్జాతీయ రేస్‌లో అజిత్ పాల్గొంటున్నారు. ఇది అజిత్ కుమార్‌కు అంతర్జాతీయ రేసింగ్ కాంపిటీషన్‌లో పాల్గొనడం మొదటి సారి. ఈ రేస్‌లో విజయం సాధిస్తే, అది ఆయన రేసింగ్ కెరీర్లో ఒక గ్రాండ్ డెబ్యూ అవుతుంది.