బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన కన్నుమూత హిందీ సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, అభిమానుల హృదయాలకూ భారీ షాక్ ఇచ్చింది. 1960లో వచ్చిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అలా ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే 19 ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ మరియు కుమార్తెలు విజేత, అజిత ఉన్నారు. కానీ.. అందరి కన్ను మాత్రం హేమ మాలిని మీదే ఉందని చెప్పాలి..
1970లలో ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో హేమ మాలినితో నటించిన సమయం నుంచి ఈ జంట మధ్య బంధం పెరిగి ప్రేమగా మారింది. తర్వాత ‘సీతా ఔర్ గీత’, ‘షోలే’ వంటి క్లాసిక్ చిత్రాలు తెరకెక్కి, వీరి జంట ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచింది. అప్పటి కథనాల ప్రకారం, ‘షోలే’ షూటింగ్‌లో హేమమాలినిని కౌగిలించే సన్నివేశాల కోసం అదనపు టేక్‌లు తీసుకోవాలనే ధర్మేంద్ర కోరికతో ఆయన లైట్‌బాయ్‌లకు డబ్బులు కూడా చెల్లించేవారని వార్తలు ప్రచారం అయ్యాయి. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు ధర్మేంద్ర కి హేమ మాలిని పై ఉన్న ఇష్టం ఎలాంటిదో. ఇక తాజాగా, ధర్మేంద్ర మరణం తర్వాత హేమ మాలిని తన తొలి భావోద్వేగ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుని, తన నష్టం “వర్ణించలేనిది” అని తెలిపారు. అనేక చిత్రాల్లో నటించిన, జీవిత భాగస్వామిగా గడిపిన ధర్మేంద్ర ను కోల్పోవడం ఆమెకు ఎంతటి బాధ కలిగించిందో ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైంది.
Hema Malini shares emotional first post after Dharmendra's death, says her loss is "indescribable"
Read @ANI Story |https://t.co/4GUm7H2fCC #HemaMalini #Bollywood #Dharmendra #DharmendraDeath #Heman #Sholay pic.twitter.com/jbNHE8OD87
— ANI Digital (@ani_digital) November 27, 2025