NTV Telugu Site icon

Hyderabad: ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

Traffic Jam

Traffic Jam

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రేపు శోభాయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి, బేగంబజార్, మోజం జై మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుండి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. గణేష్ నిమజ్జనం, హాలిడే కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు సిటీ జనం. మరోవైపు.. మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.

Read Also: Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైల్ పేరు మారింది.. ఇకపై ఇలా పిలవాలి..

మరోవైపు.. గణేష్ నిమజ్జనానికి సంబంధించి మేయర్ విజయలక్ష్మి ఎన్టీవీతో మాట్లాడారు. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ట్యాంక్‌బండ్ తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చెరువులల్లో నిమజ్జనాలు జరగనున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నాం.. నిమజ్జనంపై తొలిసారి సీఎం రివ్యూ చేశారు.. సలహాలు సూచనలు చేశారు.. కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి.. పోలీసులు చూసుకుంటారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.

Read Also: Hyderabad Youth Died: కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం..

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసి సిబ్బందికి సహకరించండని తెలిపారు. పదిహేను వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జనం డ్యూటీల్లో పాల్గొంటున్నారు.. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్.. హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ డిప్లై చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.. రేపటి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసి సిబ్బందికి అసలైన పని ఉంటుందని ఆమ్రపాలి తెలిపారు.