China Rains: చైనాలో భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ పొడిగింపు
- చైనాలో భారీ వర్షాలు
- ఎమర్జెన్సీ అలర్ట్ పొడిగింపు
- కొండచరియలు విరిగిపడి 8 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. రానున్న తుఫాను దృష్ట్యా ఎమర్జెన్సీని పొడిగించారు. అక్కడి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాబోయే వారంలో యాంగ్జీ నది మధ్య, దిగువ ప్రాంతాలలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
Eating Dry Fruits: డ్రై ఫ్రూట్స్ను ఇలా తినండి.. ఆరోగ్యానికి చాలా మంచిది
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
టైఫూన్‌ల కోసం చైనా నాలుగు-స్థాయి అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను కలిగి ఉంది. లెవల్ I అత్యంత తీవ్రమైనది. ఇదిలా ఉండగా.. హీలాంగ్‌జియాంగ్, హునాన్, జియాంగ్జీలలో భారీ వర్షం మరియు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఆదివారం ఉదయం టైఫూన్ కోసం ఆరెంజ్ అలర్ట్ విధించింది. ఆదివారం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు.. జియాంగ్సు, అన్హుయ్, హుబే, జెజియాంగ్, యునాన్, గుయిజౌ, గ్వాంగ్జీ మరియు హైనాన్ వంటి ప్రాంతాలలో భారీ వర్షపాతం ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 70 మిమీ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వాలు తగిన సన్నాహాలు చేస్తుంది.
TS Inter Supply Results 2024: రేపు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు..
ఇదిలా ఉంటే.. మధ్య చైనాలోని పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది మృతి చెందారని, ప్రతికూల వాతావరణం కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాలను హై అలర్ట్‌లో ఉంచినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. భారీ వర్షం కారణంగా హునాన్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడినట్లు తెలిపింది. ఈక్రమంలో.. నాలుగు ఇళ్లు కూలిపోయాయని, 8 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. అలాగే.. శనివారం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 50 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!