Site icon NTV Telugu

Argentina: భారీ వర్షాల దెబ్బకి 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు

Argentina

Argentina

Argentina: అర్జెంటీనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలు మంది గల్లంతయ్యారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. అర్జెంటీనాలోని తూర్పు తీరంలోని బహియా బ్లాంకా నగరంలో వర్షాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ వర్షానికి వచ్చిన వరద నీటిలో అనేక మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, రాజధాని బ్యూనస్ అయర్స్‌కు దక్షిణంగా ఉన్న బహియా బ్లాంకా నగరం నుంచి 1,450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Read Also: MLA Quota MLC elections: నేడు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌.. అసంతృప్తులకు బుజ్జగింపులు..!

గత రెండు రోజుల్లో బహియా బ్లాంకాలో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సాధారణంగా అక్కడి సగటు నెలవారీ వర్షపాతం సుమారు 129 మిల్లీమీటర్లు మాత్రమే. అయితే, రాబోయే 72 గంటల పాటు వర్షం కురిసే అవకాశం లేదని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం వరదల కారణంగా 10 మంది మృతి చెందారని ప్రకటించిన అధికారులు, ఆదివారం ఈ సంఖ్య 16కి చేరుకున్నట్లు వెల్లడించారు. బహియా బ్లాంకా నగరంలోని మేయర్ కార్యాలయం ప్రకారం, మరిన్ని ప్రాణ నష్టాలు జరిగే అవకాశముందని వెల్లడించారు. రాజధాని బ్యూనస్ అయర్స్ నుండి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరంలో సుమారు 3.5 లక్షల మంది జనాభా ఉంది.

Read Also: Final Judgement: ప్రణయ్ పరువు హత్య కేసు.. నేడే తుది తీర్పు

తీవ్రంగా ముంచుకొచ్చిన వరద నీటిలో చిక్కుకున్న ఓ కారులో ఐదుగురు జల్ సమాధి అయ్యారు. ప్రొవిన్షియల్ సెక్యూరిటీ మంత్రి జేవియర్ అలొన్సో తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ప్రారంభమైన వర్షం కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో సుమారు 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణంగా బహియా బ్లాంకాలో సంవత్సరమంతా వచ్చే వర్షపాతంతో సమానమని వెల్లడించారు. సెక్యూరిటీ మంత్రి బుల్రిచ్, రక్షణ మంత్రి లూయిస్ పెట్రీ తాకిడికి గురైన ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రయత్నించారు. అయితే, వారి పర్యటన ఆలస్యంగా జరిగిందన్న కారణంగా స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Exit mobile version